విశాఖలో ఏయూ విద్యార్ధుల ఆందోళన

విశాఖపట్నం, నవంబర్ 6: ఆంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పారావు అదృశ్యం కేసు ఉదంతం వీడింది. మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నారనే అనుమానంతో తామే అప్పారావును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ రూరల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ గురువారం వెల్లడించారు. ఈ సంఘటనపై ఏయూ విద్యార్ధులు ప్రొఫెసర్ అప్పారావు అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఎస్పీ కార్యాలయం వద్దకు విద్యార్ధులు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రొఫెసర్ కు మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించడం దారుణమన్నారు. ప్రొఫెసర్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. అప్పారావును విడుదల చేసేవరకు యూనివర్సిటీ బంద్ పాటిస్తామని విద్యార్ధులు హెచ్చరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.