విశాఖ పునర్మిణానికి నా వంతు కృషి : పవన్

విశాఖపట్నం, అక్టోబర్ 16: హుద్‌ హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సానికి విశాఖ నగరం తీవ్రంగా నష్టపోయిందని జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమర్దవంతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పాలనా అనుభవంతోనే చంద్రబాబు నష్టాన్ని నివారించగలిగారన్నారు. క్లిష్టపరిస్థితులను ఎదుర్కునే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని పవన్ కొనియాడారు. విశాఖ పునర్నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం హుద్ హుద్ తుపాన్ బాధితుల కోసం పవన్‌ రూ. 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడు ముందుంటారని అన్నారు. తుపాన్ బాధితుల కొరకు 50 లక్షల విరాళాం ఇచ్చిన పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.