వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

VRO-vra-exams

వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు రేపు రాత పరీక్ష నిర్వహించడానికి విసృతమైన ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.1657 విఆర్వో పోస్టులకు 13 లక్షల 13 వేల అభ్యర్థులు పోటి పడుతుండగా 4,305 విఆర్ఏ పోస్టులకు 62 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థుల్లో ఇప్పటి వరకు 13 లక్షల 37 వేల 824 మంది అభ్యర్థులు హల్ టికేట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని రెవెన్యూశాఖమంత్రి రఘవీరారెడ్డి తెలిపారు. పరీక్షా ప్రశ్నపత్రాలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమంలో ఉంటాయని అన్నారు.

వీఅర్వో పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 239 పట్టాణాల్లో 3684 పరీక్ష కేంద్రాల్లో, విఅర్ఏ పోస్టుల కోసం 195 పరీక్ష కేంద్రల్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. పరీక్ష నిర్వహణలో 65 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 25 వేల మంది పోలీస్ లు విధులు నిర్వహిస్తారని చేప్పారు. హల్ టికెట్లు లో ఫోటో తప్పు దోర్లితే గెజిటెడ్ అధికారి సంతకం తోపాటు మూడు ఫోటోలు, ప్రభుత్వం గుర్తింపు కార్డు పరీక్షా కేంద్రానికి తీసుకొని రావాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. ఒక్క నిమిషం అలస్యం అయిన అనుమతినిచ్చే ప్రసక్తే లేదని చెప్పారు.

పరీక్షకేంద్రాలకు ఏలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకరావద్దని సూచించారు. పరీక్షలను వీడియో తీస్తామని మంత్రి 737 ప్లాయింగ్ స్కాడ్ నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. ప్రతి అభ్యర్థి వేలిముద్రలు తీసుకుంటూ పూర్తి పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తామని చేప్పారు. విఆర్వో, వీఅర్.ఏ పరీక్ష ప్రాధమికి కీ ఫిబ్రవరి 4 , ఫిబ్రవరి 10 న ఫైనల్ కీ విడుదల చేసి ఫిబ్రవరి 20 న ఫలితాలు ప్రకటిస్తామని రఘవీరా రెడ్డి చెప్పారు. 26వ తేదీ నుంచి ఎంపికయిన అభ్యర్థులకు నియామక ప్రక్రియ జరగుతుందని వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.