వెంకీ ‘రాధా’ సినిమా కాపీ కథ కాదంటున్న మారుతీ

Radha-movie-wallpaper

విక్టరీ వెంకటేష్ హీరోగా తాను రూపొందిస్తున్న ‘రాధా’ సినిమా కథ ‘కాపీ కథ’ అంటూ వస్తున్న వార్తలను దర్శకుడు మారుతి తీవ్రంగా ఖండించాడు. సురేంద్ర కృష్ణ అనే రచయిత వెంకటేష్ కు ఓ కథ చెప్పాడనీ, అందులో కథానాయకుడైన ఎమ్మెల్యే ప్రేమలో పడతాడనీ, ఆ కథను మారుతికి చెప్పి హోమ్ మినిస్టర్ గా హీరో పాత్రను మార్చమని చెప్పాడనీ, అలా ఈ కథ తయారైందనీ ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని మారుతి మీడియాకు స్పష్టం చేశాడు. ఈ విషయంలో తాను రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాననీ, తన కథను వారు పరిశీలించి క్లీన్ చిట్ ఇస్తారన్న నమ్మకం ఉందనీ మారుతి చెప్పాడు. 80 సన్నివేశాలున్న ‘రాధా’ స్క్రిప్టులో ఒక్క సీను కూడా కాపీ సీను ఉండదనీ, తన దగ్గర ఎన్నో కథలు ఉన్నాయనీ, ఇలా కథలు కాపీ కొట్టి తీయాల్సిన అవసరం లేదని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.