వెంటనే విధుల్లోకి చేరండి : కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 27: గ్రామాల్లో సేవచేయకుంటే ఇక డాక్టర్ల చదువులెందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ డాక్టర్లపై ఆగ్రహం చెందారు. రేపటిలోగా విధుల్లో చేరకుంటే 6 నెలలపాటు డిబార్ చేసేందుకు కూడా వెనకాడవద్దని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి  సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ కూడా బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వెద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలు చేపడతామని రాజయ్య హెచ్చరించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.