వేతనాల పెంపు

kcr-assembly-13

హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎన్నో రోజులుగా డిమాండ్ గా ఉన్న గౌరవ వేతనాలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్, కార్పోరేషన్ల మేయర్లతో పాటు సర్పంచ్ లకు వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచాలని  కొంత కాలంగా  డిమాండ్ నెలకొంది. ఈ విషయమై గురువారం నాడు స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ డిమాండ్లను వివరించారు. కేటీఆర్ ను కలిసిన 24 గంటల్లోనే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ల గౌరవ వేతనం మాత్రం రూ 7,500 మాత్రమే.  జడ్పీటీసీ నుంచి సర్పంచ్ వరకూ కేవలం రూ 2 వేల నుంచి వెయ్యి రూపాయల లోపు వరకు ఇప్పటివరకు గౌరవ వేతనంగా ఇస్తున్నారు. క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్న జిల్లా పరిషత్ చైర్మెన్ల గౌరవ వేతనాన్ని రూ 7,500 ల నుండి లక్ష రూపాయాలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అదే విధంగా జడ్పీటీసీ సభ్యుడి కి రూ 10 వేలు, మండల పరిషత్ అధ్యక్షుడుకి రూ 10 వేలు, ఎంపీటీలు,  గ్రామపంచాయితీ సర్పంచ్ లకు రూ 5 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు వేతనాల పెంపు చేస్తూ శుక్రవారం శాససభలో ప్రకటించారు.

ఇక మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లకు రూ 14 వేల నుండి రూ 50 వేలు, డిప్యూటీ మేయర్లకు రూ 8 వేల నుండి రూ 25 వేలు, కార్పోరేటర్లకు రూ 4 వేల నుండి రూ 6 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ప్రత్యేక గ్రేడ్ చైర్ పర్సన్ లకు రూ 15వేల రూపాయలు, ఇతర చైర్ పర్సన్ లకు రూ 7,500 లు ప్రభుత్వం పెంపు చేసింది. ఇతర వైస్ చైర్ పర్సన్ లకు  రూ 5 వేలు, ప్రత్యేక గ్రేడ్ కౌన్సిలర్లకు రూ 3,500, ఇతర కౌన్సిలర్లకు రూ 2,500 లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • bandirao says:

    Very good