వైఫై నగరంగా హైదరాబాద్

వైఫై నగరంగా హైదరాబాద్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలకు ఉచిత వైఫై సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ ఎల్ తో కలిసి క్వాడ్ జెన్ కంపెనీ సేవలు అందించేందుకు అవగాహన కుదుర్చుకొంది.

హైదరాబాద్ ను దశల వారిగా వైఫై నగరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఉచిత వైఫై సేవలపై బీఎస్ ఎన్ ఎల్ ఉన్నతాధికారులు, క్వాడ్ జెన్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ ఎన్ ఎల్  తో కలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించబోతుంది. తొలుత హుస్సేన్ సాగర్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలను తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్డు పరిధిలోని సుమారు 1800 నుంచి 2500 మంది పౌరులు ఈ సేవలను ఒకేసారి వినియోగించుకునే వీలు ఉంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.