వైయస్సార్ బతికుంటే విభజన ఉండేది కాదు : విజయమ్మ

వైయస్సార్ బతికుంటే విభజన ఉండేది కాదు : విజయమ్మ

న్యూఢిల్లీ : వైయస్సార్ బతికుంటే విభజన ఉండేది కాదని స్వయంగా ప్రధాని మన్మోహన్ అన్నట్లు వైయస్సార్ సిపి నాయకురాలు విజయమ్మ తెలిపారు. రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ వైయస్సార్ః సిపి నేతలు విజయమ్మ, మేకపాటి తదితరులు ప్రధానిని కలిసి విభజన వల్ల ఏర్పడే సమస్యలను విన్నవించారు. ీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని పై వ్యాఖ్య చేశారని విజయమ్మ మీడియాకు తెలియజేశారు. విభజిస్తే ఉభయ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు ఎలా కొనసాగిస్తారని ఆమె ప్రశ్నించారు. కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ప్రధానిని కోరినట్లు తెలియజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.