వ్యాఖ్యలను వక్రీకరించారు : పోచారం

హైదరాబాద్, నవంబర్ 8: రైతులు ఆత్మహత్యలపై తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రతికలు వక్రీకరించాయని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం జరిగే శాసనసభలో విపక్షాలు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హమీ ఇచ్చారు.

 

“నేను అనని మాటను అన్నట్లు కొంత మంది సృష్టించారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, జరగటంలేదని అనడంలేదు. ఇప్పటికిప్పుడు ఎంతమంది రైతులు ఆత్యహత్యలు చేసుకున్నారో చెప్పలేం, దానికి ఒక కమిటి ఉంది. ఆర్డివో, డిఎస్ పి కమిటి విచారణ చేసిన రిపోర్టును కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తారు. అందిన రిపోర్టును ఆధారంగా చేసుకొని వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది“ అని పోచారం శ్రీనివాస రెడ్డి గతంలో అన్నదని తెలిపారు. దానిని కొంతమంది రాజకీయంచేసి ఆత్మహత్యల గురించి కించపరచినట్లు మాట్లాడన్నారు అనడం చాలా దారుణం అని మంత్రి ఆరోపించారు. ఆత్మహత్యలు అనేది చాలా బాధాకరం. ఈ ఆత్మహత్యలు జరుగకూడదని కోరుకుంటున్నామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.