శాన్వి హత్యకేసులో రఘునందన్ కు మరణశిక్ష

హైదరాబాద్, అక్టోబర్ 15: అమెరికా పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వి, సత్యవతిల హత్య కేసులో నిందితుడైన యండమూరి రఘునందన్ కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. రెండేళ్లపాటు విచారణ చేసిన అమెరికా కోర్టు రఘునందన్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 2012 అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో నివాసం ఉంటున్న శాన్వి అనే చిన్నారిని రఘునందన్ కిడ్నాప్ కు యత్నించాడు. ఆమె నాయనమ్మ సత్యవతి (61) అడ్డుకోవడంతో ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత చిన్నారిని కూడా హతమార్చాడు. రెండు హత్యలు తనే చేసినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకోవడంతో అమెరికా న్యాయస్థానం అతనికి మరణశిక్షను విధించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.