శాశ్వత కోమాలోకి ఫార్ములా వన్ రేసర్

formula-1-racing-schumacher

ఫార్ములా వన్ రేసర్ గా చరిత్ర సృష్టించి స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మైఖేల్ షుమాకర్ శాశ్వతంగా కోమాలోకి జారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.  ఫ్రాన్స్ లోని ఆల్ఫ్ పర్వత ప్రాంతంలో 19 రోజుల క్రితం స్కీయింగ్ చేస్తూ షుమాకర్ పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లిపోయారు. అప్పట్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోంచి బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకునే అవకాశాలు కూడా లేవంటూ బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన మీడియాలో కథనాలు వెలువడటంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే షుమాకర్ కుటుంబసభ్యులు మాత్రం ఆయన పరిస్థితిపై పెదవి విప్పడం లేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.