శింబుతో రహస్యంగా నయనతార పెళ్లి

Simbu-nayanatara

నయనతార, శింబు గత కొన్ని నెలలుగా ఇద్దరు ఒకరికరు ఎదురు పడినా మాట్లాడుకోవడంలేదు. కనీసం ఒకరినొకరు చూసుకోవడం లేదు. ఎందుకోసమో మనందరికీ తెలిసిన విషయమే. శింబు, నయనతార మధ్య ప్రేమాయణం నడవటం.. ఆ తర్వాత అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడం.. అప్పటి నుంచి ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేసారు. ఉన్నట్టుండి వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అది కూడా నాలుగు సార్లు…. అదేంటీ ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా.. నయనతార, శింబు కాంబినేషన్ లో పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో వీరిద్దరు ఏకంగా నాలుగుసార్లు వివాహం చేసుకుంటారంట.. అది కూడా ఒకసారి పంచభూతాల సాక్షిగా తాళి కట్టి… రిజిస్ట్రార్ ఆఫీసులో మరోసారి… క్రిస్టియన్ పద్ధతిలో ఇంకోసారి…. హిందూ సంప్రదాయంలో మరోసారి..!
షూటింగ్ లో కూడా వీరద్దరు ఇంతకు ముందులానే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారట.. మరి నిజ జీవితంలో మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.