శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

హైదరాబాద్, నవంబర్ 6: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ, కేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

వరంగల్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వేయిస్థంబాల గుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయం భక్తుల సందడితో నెలకొంది. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని తరిస్తున్నారు.

kmmహైదరాబాద్‌: నల్లకుంట శంకర్‌మఠ్‌ దేవాలయం దగ్గర కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, స్వామి వారిని దర్శించుకున్నారు.

ఖమ్మం: ఖమ్మం శ్రీగుంటుమల్లేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజామునే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట ఆలయంలో భక్తులతో సందడిగా మారింది. శివ, కేశవులు కొలువైన ఈ క్షేత్రాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్శించేందుకు వచ్చిన భక్తులు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలతో మండపాలు సందడిగా మారాయి. adialabadపుష్కరిణిలో పుణ్యస్నానాలుచేసి భక్తులు తరిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని వాడపల్లి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ భక్తలు దీపపు కాంతుల వెలుగులతో కళకళలాడాయి. పండితుల వేదమంత్రాలు, భక్తుల శివనామస్మరణలతో మార్మోగాయి.
రాజమండ్రి: గోదావరి తీరం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు, దీపారాధనలు చేశారు. శివనామస్మరణతో గోదావరి తీరం ప్రతిధ్వనించింది. పుష్కర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ ఏర్పడింది.

kartika deepamకోటప్పకొండ: గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రమైన కోటప్పకొండపై కార్తీకపౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. త్రికోటేశ్వరుని సన్నిధి శివనామస్మరణతో మార్మోగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

విజయవాడ: విజయవాడ వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానమాచరించిన భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే బారులు తీరారు. దుర్గామల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దుర్గాఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

godavariకరీంనగర్‌: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. స్థానికులతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.