శ్రీధర్ బాబు శాఖ మార్పుపై గవర్నర్ ను కలిసిన టీ.మంత్రులు

Governor-narasimhan

తెలంగాణ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు నిర్ణయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తో భేటీ అనంతరం టీమంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలను గమనించాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు, అసెంబ్లీ నడుస్తున్న తీరు, చర్చ జరగవలసిన అవసరాన్ని గమనించాల్సిందిగా గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

శ్రీధర్ బాబుపై సీఎం తీసుకున్న చర్యను తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారని దీన్నొక పైశాచిక చర్యగా భావిస్తున్నామని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను ‘వినాశకాలే విపరీతబుద్ధికి సంకేతంగా’ భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ చర్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని సీఎం నిర్ణయాలను హైకమాండ్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. టీమంత్రులంతా సమావేశమై రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని జానా తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.