శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజన సేవ

alwar seva-30

శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం సేవలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్తానం ఈవో సాంబశివరావు దంపతులు

తిరుమల, డిసెంబర్ 30: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కో‍యల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టింది. ప్రతి సంవత్సరం ఉగాది, అణివార అస్ధానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందే వచ్చే మంగళవారాల్లో ఈ సేవను జరపడం అనవాయితీ.

గర్భాలయంలోని అన్ని ఉత్సవవిగ్రహలతో పాటు బంగారు, వెండి పాత్రలను ఘంటా మండపానికి తీసుకువచ్చి శుద్ధి కార్యక్రమం చేపడతారు. గర్భాలయంలోపల నిత్యం వెలిగే అఖండదీపాల కారణంగా దుమ్ముధూళి, మసి పెరుకుపోతుంటుంది. ఆలయంలోపల కర్పూరం, నేతి దీపాల మసిని, అలాగే దుమ్ముధూళి , బూజులను తొలిగించి శికాయ నీటితో గోడలను శుభ్రం చేస్తారు. అనంతరం నామంకోపు, శ్రీచుర్ణం, గడ్డకర్పూరం, గంధం పోడి, కుంకమ, ఖిచిలిగడ్డలను మిశ్రమంగా చేసి ఆలయ గోడలకు  పై పూతగా పూయడంతో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం ముగుస్తుంది.

ప్రతినిత్యం స్వామివారి పూజకైంకర్యాలకు వినియోగించే వస్తు, సామగ్రిలను శుభ్రం చేయడంతో పాటు, వాటిలో ఏవైనా మరమ్మతులకు గురైవుంటే, వాటిలో స్థానంలో కొత్తవి తీసుకొని వచ్చేందుకు కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది తరతమ భేదాలు లేకుండా స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి సేవ చేసేందుకు పేద, ధనిక వంటి తారతమ్యాలు లేవని, అందరూ భగవంతుడి దృష్టిలో సమానమని చాటి చెప్పడమే ఈ కోయల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రధానోద్దేశ్యం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.