సంపూర్ణ తెలంగాణ కొరకు ఉద్యమిద్దాం – కె.సి.ఆర్

సంపూర్ణ తెలంగాణ సాధించేదాకా ఉద్యమం కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. ఆదివారం నిజాం కళాశాల మైదానంలో కాళోజీ ప్రాంగణంలో, ఆచార్య జయశంకర్ వేదికగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల నుంచి వచ్చిన తెలంగాణవాదులతో నిజాం కళావాల ప్రాంగణం కిక్కిరిసిపోయాయి. సమైక్యాంధ్రంలో జరుగుతున్న అల్లర్లకు సృష్టికర్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఅని, ఆయన సమైఖ్యాంధ్ర ఐకాస చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడని. ఆయన కథ ఈ నెల 6వ తేదీతో ముగుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరితరము కాదని, ఇప్పుడు కేంద్రలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని లేని పక్షంలో తెలంగాణ ఇవ్వడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భాజపా నేతలు చేసిన ప్రకటనను కెసిఆర్ గుర్తుచేశారు.

తెలంగాణతో పెట్టుకున్నవారు ఎవరు బాగుపడలేదని చెబుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయంగా దెబ్బతిన్నారని అదే విధంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి పావురాలగుట్టలో పావురమయ్యాడంటూ ఆయన భాషలో తెలిపారు

ఆంధ్రా తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే ఆంధ్రాకు 5 లక్షల కోట్ల ప్యాకేజిని చంద్రబాబు నాయుడు ఇమ్మన్నాడు. ఈ సమైఖ్య రాష్ట్రం విడిపోతున్న సమయంలో ప్యాకేజి ఎవరికి? దొబ్బి తిన్నోళ్ళకా? నష్టపోయిన వాళ్ళకా? తెలంగాణ వాళ్లకే ప్యాకేజీ ఇవ్వాలి. మహబూబ్ నగర్ కు వంద టీఎంసీల నీళ్లు ఇవ్వలేకపోవడంతో ఇక్కడి సగం జనాభా వలసపోయారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకే 45 వేల కోట్ల నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ నాశనమై నడుము ఒంగిపోయింది. చందమామలాంటి పిల్లల బదుకులు సర్వనాశనమైనాయి. ఆదిలాబాద్ లో అంటు వ్యాధులతో వందలమంది గిరిజను చనిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడు. ఎంతసేపటికి చంద్రబాబు ఆంధ్రా డబ్బాకొట్టడమే లక్ష్యం.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చారు. ఇప్పుడు సీడబ్ల్యూసీ తెలంగాణ ఇచ్చేస్తామనగానే మళ్లీ అంతే వేగంగా రంగులు మార్చారు. ఆంధ్రోడు ఎవడైనా ఆంధ్రోడే అది జగన్ పార్టా, తెలుగుదేశమా, కాంగ్రెసా ఇదంతా కాదు. ఆంధ్రోళ్లు మొత్తం ఆంధ్రోళ్లే.  టీడీపీ, కాంగ్రెస్, జగన్ పార్టీ… ఏదైనా అంతే! లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే. ఆంధ్రలో పుట్టిన వాళ్లంతా తెలంగాణ ద్రోహులే.  తెలంగాణను దోచుకోవాలని చూసేవాళ్లే.  ఈ సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దర్శకత్వం వహించాలి, ఎంత గంభీరంగా వ్యవహరించాలి, ఎంత గొప్పగా ఆలోచించాలి, తెలివి ఉంటే ఇరుప్రాంతాల వాళ్లను సమన్వయపరచి ఇబ్బంది లేకుండా రాష్ట్ర విజనను చేయించాలి. తెలివిలేకపోతే, ఇది జీర్ణం కాకపోతే రాజీనామాచేసి పక్కకు తప్పుకోవాలి. యావన్మంది ఆంధ్రావాళ్లు ఏకమై తెలంగాణను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.  కానీ తెలంగాణ ప్రజలకు భగవంతుడి ఆశీర్వాదం ఉంది. తెలంగాణ పోరాటంలో ధర్మం, న్యాయం ఉంది. ఈ ఆంధ్రావాళ్లతో ఏమీ కాదు. లక్షమంది చంద్రబాబులు, లక్ష మంది జగన్‌లు, లక్ష మంది కిరణ్‌లు వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరు.

హైదరాబాద్ పై కిరికిరి పెడితే ఊర్కోబోం. మళ్లా ఉద్యమం తప్పదు. తెలంగాణ ప్రజలు ఆంక్షలులేని హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను కోరుకుంటున్నారు. తెలంగాణలో 85 శాతం బలహీనవర్గాల వారున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ల కళ్లలో మెరుపులు, సంతోషం, చిరునవ్వులు చూడగలం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రజలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇదే ఒరవడి కొనసాగించాలని ఆయన కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.