‘సకలం’ వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Pongal

గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పద్య కావ్యాలు, ముంగిళ్లలో ముగ్గులు, పిండి వంటల ఘుమఘుమలు, గాలి పటాల హడావిడి సంక్రాంతి అనగానే ప్రతివారి మదిలోనూ ఆవిష్కృతమయ్యే దృశ్యాలు. ఇప్పుడు ప్రతిపల్లెలోనూ ఇదే వాతావరణం వెల్లివిరుస్తోంది. సంబరాల సంకురాత్రి పండుగ పల్లెలకు కొత్త కళను తీసుకు వచ్చింది.

కోళ్ల, ఎడ్ల పందెలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, బోగి పండ్లు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తలు పండుగ అంటే ఇది అని చెప్పే వేడుకే సంక్రాంతి. అన్ని పండుగలకన్నా సంక్రాంతి అంటే చిన్నా పెద్దా అందరీకీ చెప్పలేనంత ఇష్టం. భారతీయులంతా జరుపుకునే మకర సంక్రాంతి తెలుగు వాళ్లుకు మాత్రం పెద్ద పండుగ .సంక్రాతితో దక్షిణాయనం పూర్తరయి ఉత్తరాయనం మొదలవుతుంది. ధనూరాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే పర్వదినాన్పే సంక్రాంతి జరుపుకొంటున్నాం.
సంక్రాంతి మన పండుగ. తెలుగు పండుగ. అచ్చమైన పల్లె పండుగ. బతుకు బాటలో తలోదిక్కుకి ఎగిరిపోయిన గువ్వలన్ని తిరిగి గూటికే చేరి సందడి చేసే నిండైన పండుగ.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.