సకల జనుల భేరికి ఎన్నారైల మద్దతు

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో ఈనెల 29 వ తేదిన హైదరాబాద్ నిజాం కాలేజి గ్రౌండ్ లో నిర్వహించనున్న “సకల జనుల భేరి”ని విజయవంతం చేయాలని ఎన్నారై తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనీల్ మరియు తెలంగాణ ఎన్నారై ఫోరం లండన్ ప్రతినిధి రంగువెంకట్ తెలంగాణావాదులకు పిలుపునిచ్చారు. సకల జనుల భేరికి మద్దతుగా నిన్న రాత్రి లండన్లోని నెహ్రు విగ్రహంవద్ద వారు కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. తెలంగాణా రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ఈ సందర్భంగా వారు నివాళులు అర్పించారు.

తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నారని, వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి నాలుగున్నకోట్ల ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఎ.పి.ఎన్.జి.వో నాయకుడు అశోక్ బాబు చేస్తున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా ద్రోహి అని ఇక ఆయన అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

 తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి తలపెట్టిన “సకల జనుల భేరి” కి ఇంటికి ఒకరు చొప్పున పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు. అదే విధంగా తెలంగాణ సత్తా ఎమిటో ఇటు తెలంగాణ ద్రోహులకి, అటు డిల్లి పెద్దలకు తెలిసేలా చేయాలని వారు విజ్ఞప్తి చేసారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.సి.ఆర్ మరియు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ కోదండరాం ఆదేశాల మేరకు ఎటువంటి పోరాటాలకైనా ప్రపంచంలోని తెలంగాణ ఎన్నారై ప్రజలు సిద్దంగా ఉన్నారని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, టిఇ.ఎన్.ఎఫ్ కోఆర్డినేటర్ నవీన్ రెడ్డి, జువ్వాడి వేణుగోపాల్ రావు, శుశుమ్న రెడ్డి, ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ సంయుక్త కార్యదర్శులు సిక్క చందూ గౌడ్  మరియు అశోక్ దూసరి, లండన్ ఇంచార్జ్ శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైసరీ బోర్డ్ సబ్యులు వేనుముద్దల విష్ణువర్ధన్ రెడ్డి, ఐటి సెక్రటరీ శ్రవణ్  రెడ్డి, చిత్తరంజన్ రెడ్డి, రంగు వెంకట్, ప్రసాద్ తోట, ప్రశాంత్ రెడ్డి, సంతోష్, రోహిత్, రవి ల   తో పాటు హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్  ప్రతినిథులు మల్లా రెడ్డి,  మల్లేష్   యాదవ్, జితేందర్ బీరం, చోటు  శ్రీచక్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.