సచివాలయ ఉద్యోగుల స్థానికతపై కమిటీ ఏర్పాటు

సచివాలయ ఉద్యోగుల స్థానికతపై కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానికతపై పరిశీలనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి బుసాని వెంకటేశ్వర్ రావు చైర్మన్ గా మరో నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు. కమిటీలో జీఏడీ జాయింట్ సెక్రెటరీ ఎన్. శంకర్, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  మధవరపు నరెందర్ రావు, విద్యాశాఖ నుంచి కార్యదర్శిని ఇందులో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానికతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఉద్యోగుల నియామకం, వారి విద్యార్హత, స్థానిక సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. అదే విధంగా ఉద్యోగులు నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.