సభాపతి కార్యాలయంలో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు

tdp-speaker-24

తెలంగాణ సభాపతి ఛాంబర్ లో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సభాపతి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బైఠాయించి తమ నిరసనను తెలుపుతున్నారు. సభాపతి ఇచ్చిన హామీ పట్ల సంతృప్తి చెందని టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.

మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభాపతి మధుసూదనాచారిని కలిశారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఎటువంటి చర్యలు తీసుకొన్నారో తెలపాలని, సీట్ల కేటాయింపు విషయమై నిర్ణయాన్ని ప్రకటించాలని వారు సభాపతిని కోరారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తున్నట్టు సభాపతి మధుసూదనాచారి తెలపారు. సభాపతి సమాధానంతో సంతృప్తి చెందని టీడీపీ ఎమ్మెల్యేలు సభాపతి కార్యాలయంలో బైఠాయించారు.

భోజన విరామ సమయంలో సభాపతి తన కార్యాలయంలోకి వచ్చారు. అప్పటికీ కూడ టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సభాపతి కార్యాలయం లోనే ఉంటామని వారు భీష్మించుకొని కూర్చున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.