సమాజానికి అవమానం

బెంగళూరు, అక్టోబర్ 22 : సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా బెంగళూరులో దారుణం జరిగింది. మానవత్వానికి మాయని మచ్చలా ఈ ఘటనైంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు, జలహలి క్రాస్ లోని ఆర్చీడ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఓ చిన్నారి ఎల్ కేజీ చదువుతుంది. స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్లిన చిన్నారికి డ్రస్ మార్చే సమయంలో పాప తల్లి ఆ విషయాన్ని గుర్తించింది. ఘోరమైన లైంగిక దాడితో పాప బెదిరిపోయి ఉంది. ఏం జరిగిందో పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో పాప ఉంది. వెంటనే పాప తల్లి స్కూల్ లో విచారించిన అనంతరం జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బెంగుళూరు కమీషన్ ఎం ఎన్ రెడ్డి తో పాటు పాఠశాలను సందర్శించారు.

పాపపై లైంగిక దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. స్కూలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు పాఠశాల్లో ఉన్న సిసి కెమెరాల పుట్టేజ్ ను పరిశీలిస్తున్నారు. పాఠశాలలో పనిచేస్తున్నఉపాధ్యాయుల నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్కూలు కు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, లైంగిక దాడికి పాల్పడిన వారిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తత గా మారడంతో స్కూల్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.