సమీక్ష : ఆగడు

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ హీరోగా వచ్చిన దూకుడు పెద్ద హిట్‌ అవడంతో, మళ్ళీ అదే కాంబినేషన్‌లో ఆగడుపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో సినిమాని విడుదల చేశారు. మహేష్‌ సినిమా వస్తోందంటే చాలు ఆ సినిమాపై బోలెడన్ని అంచనాలుంటాయి.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఆగడు అంచనాలను అందుకోలేకపోవడంలో కొంతవరకూ విఫలమైంది. గత పోలీసు కథా చిత్రాల్లో బలమైన కథ, సెంటిమెంట్ అంశాలు ఆగడు చిత్రంలో కనిపించకపోవడం ప్రధాన లోపంగా మారింది. శ్రీను వైట్ల కథను తన పాత పద్ధతిలోనే ఉండేలా ఎంచుకున్నాడని కథనం.

తొలి భాగంలో మహేష్ బాబు ఒక్కడే సినిమా మొత్తం తన కొత్త వైఖరి, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ప్రారంభం నుంచీ ముగింపు దాకా మహేశ్ తో చెప్పించిన డైలాగుల తుపాకి గుండులా పేలినా, మొత్తంమీద మోతాదు శృతిమించిందనే చెప్పవచ్చు. మహేష్ బాబుకి తోడుగా తమన్నా గ్లామర్, శృతి హాసన్ స్పెషల్ సాంగ్ సినిమాకి కొంత వరకు తోడయ్యింది. రెండవ భాగంలో దర్శకుడు పూర్తి స్థాయిలో వీక్షకులను అలరించలేకపోయారనే అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.