సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్ 8’ సమావేశ కార్యక్రమాల బహిష్కరణ

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్  కార్యక్రమాలను బహిష్కరించాలని ఫోటోగ్రాఫర్లు నిర్ణయించారు. సల్మాన్ ‘బిగ్ బాస్ 8’ విలేకరుల సమావేశానికి కూడా వారు హాజరుకాలేదు.  ఫొటోగ్రాఫర్ల తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని సల్మాన్ అన్నారు. తాను వారిపై ఎటువంటి నిషేధం విధించలేదని, వారే తనను బహిష్కరించారని తెలిపారు. వారు మర్యాదపూర్వకంగా వ్యవహరించినంతకాలం, తాను వారితో బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే తాను పాల్గొన్న కార్యక్రమాన్ని ఫొటోగ్రాఫర్లు  చేపల మార్కెట్‑గా చేయడాన్ని తాను అంగీకరించనని సల్మాన్ చెప్పారు. ఈ వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని మీరు అనుకుంటున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ముందు వారు శాంతియుతంగా మెలగడం అవసరం అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.