సార్క్ దేశాల భద్రతే లక్ష్యం : మోదీ

 

saarc summitt-26

నేపాల్, కాఠ్ మండ్ సార్క్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్, నవంబర్ 26: దక్షిణాసియా దేశాల అభివృద్ధే లక్ష్యంగా సార్క్ దేశాలు ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. బుధవారం ఖాట్మండూలో జరిగిన సార్క్ దేశాల సదస్సులో ప్రసంగిస్తూ విమర్శలు, ద్వేషాలు పక్కనబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తీవ్రవాదాన్ని నిర్మూలించాలని ఆయన కోరారు. సార్క్ దేశాల భద్రత, శ్రేయస్సే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. 2008 లో ఇదే రోజు ముంబైలో తీవ్రవాదులు బాంబుపేలుళ్ళు జరిపిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.