సింధు గురించి….

హైదరాబాద్: ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు విజయవాడ జైహింద్ టాకీస్ అధినేత దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వర్లకి మనుమరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.  అందులో ఒక అల్లుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ జనరల్ మేనేజర్ గానూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఇప్పటికీ ఆయన అడపాదడపా టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. మరో అల్లుడు అశ్వినీదత్. ఈయన ప్రముఖ సినీ నిర్మాత.

ఈశ్వర వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బ్రహ్మయ్య, ఈయన సూపర్ స్టార్ కృష్ణ అతి సన్నిహితంగా మెలుగుతూ పద్మాలయా ఆఫీసు వద్దనే ఉండేవారు. కృష్ణతో బందిపోటు భీమన్న (1969) సహ నిర్మాతగా బంగారు కాపురం (1984) నిర్మించారు. ఈశ్వర వెంకటేశ్వర్లకు ముగ్గురు కుమార్తెలు, అందులో మూడవ కుమార్తె వాలీబాల్ క్రీడాకారిణి. ఈమె తోటి క్రీడాకారుణ్ణి కులాంతర వివాహం చేసుకున్నారు, వారి రెండవ సంతానమే ఒలింపిక్ రజత పతక విజేత పివీ సింధు!!

Have something to add? Share it in the comments

Your email address will not be published.