సినిమాలో భార్య నటన చూసి ఉరి వేసుకున్న భర్త

భార్యతో విభేదాలు.., అత్తింటి వేధింపులు.., వీటికి తోడు ఓ లఘు చిత్రంలో భార్య నటించిన సీన్లు అతడిని ఆత్మహత్యకు పురికొల్పాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఉదయభాను, అతడి భార్య లీలారాణి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు.

కోటక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉదయభాను(32) హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో స్నేహితులతో కలసి నివసిస్తున్నాడు. ఒక వైపు భార్య, 11ఏళ్ల కూతురితో ఎడబాటు. పైగా అత్తింటి నుంచి వేధింపులు.

మరోవైపు ఓ లఘు చిత్రంలో తన భార్య అసభ్యకరంగా నటించడాన్ని చూసి విరక్తి చెందాడు. ఇదే విషయాన్ని ఓ లేఖలో రాసి తన గదిలో నిన్న ఉదయం ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.