సిరీస్ భారత్ కైవసం

హైదరాబాద్, నవంబర్ 9: శ్రీలంకతో జరిగిన మైక్రోమాక్స్ వన్డే సిరీస్ ను టీమిండియా కైవశం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా  హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలో 245 పరుగులు సాధించింది లక్ష్యానికి ఛేదించింది. భారత్ తరఫున శిఖర ధావన్ 91, కెప్టెన్ కోహ్లి 53, రహనే 31 పరుగులు చేయడంతో భారత్ ఘన విజయం సాధించింది.

 

హైదరాబాద్ లో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 44.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్సోయి ఐదు ఓవర్ల ఐదు బంతులు మిగిలి ఉండానే లక్ష్యాన్ని ఛేధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 242 పరుగులకు ఆలౌట్ అయింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అలవోకగా సాధించింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఐదు వన్టేడల సిరీస్ ను భారత్ గెలుచుకుంది. మొదటి మూడు వన్డేలను సులభంగా గెలవండంతో ఈ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.