సీఆర్ డీఏ పరిధిలోకి 58 మండలాలు

capital city-30

హైదరాబాద్, డిసెంబర్ 30: రాజధానితోపాటు రాజధాని ప్రాంత పరిధిని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్ డీఏ) పరిధిలోకి 58 మండలాలను తీసుకువస్తూ ఆరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలోని మండలాలు, గ్రామాలు, వాటి సరిహద్దులు, సీఆర్ డీఏ లో ఉండే అధికారాలను ఈ జీవోల్లో పొందుపర్చడం జరిగింది. (సీఆర్ డీఏ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం)

122 చదరపు కిలో మీటర్ల ప్రాంతం రాజధాని నగరంగా, 7068 చదరపు కిలోమీటర్లు రాజధాని ప్రాంతంగా ప్రకటించారు. దీని పరిధిలోకి కృష్ణా జిల్లాలోని 29 మండలాలు, గుంటూరు జిల్లాలోని 29 మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలను పరిణలోకి తీసుకుని, ఈ మూడు మండలాల్లో 29 గ్రామాలను రాజధానిగా ప్రకటించారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ అర్బన్, రూరల్ ను రాజధాని ప్రాంత పరిధిలోకి తీసుకురావడం జరిగింది.

ముఖ్యమంత్రి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా మునిసిపల్ శాఖ మంత్రితో 9 మంది సభ్యులతో సీఆర్డీఏ కమిటీని ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంత అధికారాలన్నీ సీఆర్ డీఏ కార్యనిర్వాహక కమిటీకి బదలాయిస్తూ జీఓ జారీ చేశారు. ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అధికారాన్ని ఈ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్‑గా మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించారు. సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఆర్ డీఏ కమీషనర్ ఉంటారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.