సీఆర్ డీఏ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

narayana-20

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడుతున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ

హైదరాబాద్, డిసెంబర్ 21: రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్ డీఏ) ముసాయిదా బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ బిల్లును ప్రవేశపెట్టగా సభాపతి కోడెల శివప్రసాద్ బిల్లును అనుమతించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్ డీఏ నిర్ణయాక మండలి ఉంటుంది.  వచ్చే 30 ఏళ్లలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బిల్లును సిద్ధం చేసింది.

రాజధానితోపాటు, రాజధాని ప్రాంతమంతా ఈ సంస్థ పరిధిలోకి రానుంది. ఇప్పడికే రెండు మంత్రివర్గ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించాక ఈ బిల్లుకు తుది రూపం తెచ్చింది. ప్రాధమికంగా వెయ్యికోట్ల నిధులతోను మరో 250 కోట్ల రివాల్వింగ్ ఫండ్ తోనూ ప్రభుత్వం దీనికి నిధులు సమకూర్చింది. రాజధానిలో రోడ్డు, మెట్రో రైల్ వ్యవస్థలకు కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఉంటాయి. సీఆర్ డీఏ ఆర్ధికంగా పరిపుష్టం కావడానికి షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, డివిడెండ్లు జారీ చేసేందుకు ఆర్ధిక అధికారాలను కూడా ఈ బిల్లులో పొందుపర్చారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో విజిటీఎం, వుడా ఆస్తులు ఇతర యంత్రాగాన్ని కూడా సీఆర్ డీఏ పరిధిలోకి తెచ్చారు.

రాజధాని అభివృద్ధి భవిష్యత్ అవసరాలకోసం ప్రత్యేకంగా భూ బ్యాంకు కూడా సీఆర్డీఏ లో భాగంగానే ఏర్పాటు కానుంది. అవసరమైన చోట భూముల సేకరణతోపాటు ప్రత్యామ్నాయంగా పరిహారం లేదా అభివృద్ధి బదిలీ హక్కులను దీనికి కల్పించనుంది. రానున్న 30 ఏళ్లకు సంబంధించి అబివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ముసాయిదా బిల్లుపై సోమవారం చర్చ చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం విపక్షం సంధించే బాణాలకు తగిన సమాధానాలు ఇచ్చేందుకు అధికారపక్షం సర్వసన్నద్ధమైంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.