సీఎం దగ్గర బ్రహ్మాస్త్రముంటే.. మా వద్ద పాశుపతాస్త్రం ఉంది

Damodara-rajanarasimha

తెలంగాణను అడ్డుకునేందుకు సీఎం దగ్గర బ్రహ్మాస్త్రముంటే తెలంగాణ రాకుండా అడ్డుకునే కుట్రలను చేధించే పాశుపతాస్త్రం తమ వద్ద ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నల్లగొండ పట్టణంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన హకీ పోటీలను ప్రారంభించిన ఆయన రాబోయే తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి కృషి చేస్తామన్నారు.

విభజన జరుగక పోవడంవల్లే తెలంగాణ ప్రాంతం అన్నివిధాలుగా నష్టపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన మాజీమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నందుకు సోనియాగాంధీకి ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లతో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.