సీఎం పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

cm-kiran-resigns

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే పోరాటం చేశానని తెలిపారు. రాజకీయ పదవులు, భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

చట్ట సభల్లో ఎంపీలపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దొంగల్లాగ తలుపులు మూసేసి, సభ్యులను సస్పెండ్ చేసి, టెలికాస్ట్ ఆపేసి చర్చను చేపట్టడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. పార్లమెంటులో దిగజారిన పరిస్థితికి చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పక్షంతో, విపక్షమైన బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుని విభజనకు మద్దతు ఇవ్వడాన్ని దేశం మొత్తం గమనించిందని చెప్పారు. తెలుగు జాతినంతటినీ చీలుస్తున్న మీకు మా బాధ కనపడటం లేదా అని ప్రశ్నించారు. 50 ఏళ్ల పోరాటం తర్వాత, ఎంతో మంది త్యాగాల తర్వాత ఏర్పడిన రాష్ట్రాన్ని, 58 సంవత్సరాలు కలిసున్న తర్వాత విభజన చేయడం ఎంతవరకు సమంజసమని అడిగారు. పార్లమెంటులో పెట్టిన బిల్లులో తాను లేవనెత్తిన లోపాలన్నీ ఉన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.