సీఎం నేడు రాజీనామా చేయబోతున్నారా..?

CM-kiran-kumar-reddy

ముఖ్యమంత్రిగా  కిరణ్ ఈ రోజు  ఆఖరి రోజని అన్నట్లుగా తెలుస్తుంది. అంతకు ముందే రాష్ట్ర అసెంబ్లీకి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును అదే ఫార్మాట్ లో పార్లమెంటులో ప్రవేశ పెడితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని కిరణ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు లోక్ సభలో అదే ఫార్మాట్ లో ఉన్న బిల్లును ప్రవేశపెడితే సీఎంగా కొనసాగడం అనవసరమని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని చెప్పినట్లు సమాచారం. అయితే గవర్నర్ నరసింహన్ కు రాజీనామా లేఖను కూడా తెలిసింది.

ఈ విషయాన్నే వీడియా వారు సీఎం కిరణ్ ని అడగగా.. ముఖ్యమంత్రిగా ఆఖరి రోజు కావచ్చునని చిరునవ్వుతో వెళ్లిపోయారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సీఎం కొత్త పార్టీ పెడతారని, పార్టీ పేరు కూడా ఖరారయినట్టు వార్తలు వచ్చాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.