సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి

central-bureau-of-investigation

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు కేంద్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ దర్యాప్తు సంస్థకు మరిన్ని అధికారాలు లభించినట్లు అయ్యింది. సీబీఐ డైరెక్టర్ కు కార్యదర్శి స్థాయి అధికారాలు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు ఇదివరకే సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కేంద్రానికి సూచించింది. ఇటీవల ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. దీంతో కేంద్రం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.