సీబీఐ కోర్టు సంచలన తీర్పు

రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.  17 ఏళ్ల పాటు సాగిన కుంభకోణం కేసు విచారణలో ఆర్ జె డి అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ను రాంచీ సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం  దోషిగా తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 44 మందిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రా, జెడియు ఎంపి, పదవీవిరమణ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు, ఆదాయపనునల శాఖ అధికారి ఒకరి కూడా కోర్టు దోషులుగా పేర్కొంది.  వీరికి న్యాయస్థానం శిక్షను అక్టోబర్ 3వ తేదీన ఖరారు చేయనుంది. ఈ నేపధ్యంలో లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

లాలూప్రసాద్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 950 కోట్ల రూపాయల విలువైన దాణా స్కాం  వెలుగు చూసింది.  ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేసింది. ఖజానా నుంచి 37.7 కోట్లు కాజేశారని సీబీఐ నిర్థారించడంతో  లాలూ 1997 లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.

సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారనుంది. దీని ప్రభావం రానున్న 2014 ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. నేరచరిత ప్రజా ప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు వల్ల లాలూ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోనున్నారు. రెండు లేదా అంతకంటె ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం లాలూ ఎంపీ పదవిని కోల్పోవడంతో పాటు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఏర్పడనుంది. అదే జరిగితే లాలూ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే.

మూగ జీవాల ఉసురు ఊరికే పోలేదు. పశువుల నోటి దగ్గర కూడు లాక్కున్న ఆ పాపం 17 ఏళ్లు గడిచినా తరిమి తరిమి వెంటాడి ఒక్క లాలూకే కాదు దాంట్లో భాగం పంచుకున్నవారందరికి చివరకు కటకటాలు లెక్కించే వరకూ తీసుకెళ్లిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.