సీమాంధ్రులు సహకరించాలి

సీమాంధ్రులు సహకరించాలి

హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. టీ. కాంగ్రేస్ నేతల సమావేశం బుధవారం గీతారెడ్డి ఇంట జరిగింది. ఈ సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల కోసం పట్టుబట్టి ఆహార భద్రత బిల్లును తీసుకొచ్చిన సోనియాగాంధీకి కృతఙతలు తెలియజేశారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని కాబట్టి సీమాంధ్రులు సహకరించాలని ఆమె విఙప్తి చేశారు. రాష్ట్రవిభజన విషయంలో సీమాంధ్ర ప్రజలతో సంయమనంతో వ్యవహరిస్తామని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.