సునందా పుష్కర్ ది హత్యే

Sunanda Pushkar-6

సునందా పుష్కర్ (పాత చిత్రం)

ఢిల్లీ, జనవరి 6: మాజీ మంత్రి శశీథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. సునందా పుష్కర్ ది హత్యేనని ఢిల్లీ పోలీస్ కమీషనర్ మంగళవారం దృవీకరించారు. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మందులు అధికంగా వాడిన కారణంగా ఆమె మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు.

విషప్రయోగం వల్లే సునంద మరణించినట్లుగా ఫోర్సనిక్ నివేదికలో వెల్లడైంది. ఆ నివేదిక ఆధారంగా ఆమెపై విషప్రయోగం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సునందా పుష్కర్ మృతిని హత్యకేసుగా నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషం తీసుకోవడం లేదా విషాన్ని బలవంతంగా ఎక్కించడం వల్ల ఆమె మృతిచెందినట్లుగా ఢిల్లీ పోలీసు కమీషనర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.