సోనియాగాంధీకి అస్వస్థత

సోనియాగాంధీకి అస్వస్థత

న్యూఢిల్లి : కాంగ్రేసు అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమె నిన్నటి నుంచి  జ్వరంతో బాధపడుతున్నారు. ఆహారభద్రత బిల్లు కోసం లోక్ సభలో కాంగ్రేసుకు నాయకత్వం వహిస్తున్నాఆమె ఓటింగ్ కన్నా ముందే సభను వదిలి వెళ్ళవలసి వచ్చింది.  ప్రతిపక్షాలు బిల్లుకు అనేక సంస్కరణలు సూచిస్తున్నప్పుడు, నిన్న రాత్రతి 8.15 గంటలకు ఆమె అస్వస్థతతో సభను వదిలారు. కేంద్రమంత్రి కుమారి సెల్జా, ఆమె కుమారుడు, కాంగ్రేసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆమెతో వెళ్ళారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆమెను అంతకు ముందు రోజు ఇంటివద్దనే డాక్టర్లు పరీక్షించారు. ఆ రోజు ఉదయం సభలో ఆమె ఆహారభ్రదత బిల్లు దేశంలో ఆకలిని పారద్రోలే గొప్ప బిల్లుగా అభివర్ణిస్తూ చురుకుగా చర్చలో పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.