స్టాట్చ్యూ ఆఫ్ యూనిటీ రథాలు ప్రారంభం

Statue-of-unity

ప్రపంచంలోనే అతిపెద్ద సర్దార్ వల్లబాయ్ పటేల్ లోహ విగ్రహం ఏర్పాటు చేయడంలో బాధ్యతగా ముందుకు సాగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ అంతే బాధ్యతగా కట్టుబడి ఉందని బీజేపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ముసాయిదా బిల్లుపై కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
స్టాట్చూ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ప్రచార రథాన్ని కరీంనగర్ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు ప్రారంభించారు. గ్రామ గ్రామాన తిరిగేందుకు దేశ వ్యాప్తంగా రథాలు బుధవారం రోజు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
తెలంగాణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా సీమాంధ్ర ప్రజాప్రతినిథులు బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని విద్యాసాగర్ రావు మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆమోదించినటువంటి ఎంతో విలువైన బిల్లుకు ఎటువంటి అడ్డంకులు లేకున్నా బీజేపీ మద్దతిస్తున్న కూడా ఆలస్యం చేస్తున్నారన్నారు. అధికార, ప్రతిపక్షాలచే ఆమోదించబడ్డ బిల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండబోదని విద్యాసాగర్ రావు అన్నారు. బిల్లుపై చర్చించడానికి రాష్ట్రపతి సమయం పొడగించకూడదని ఆయన డిమాండ్ చేశారు. సమ న్యాయం పేరుతో కాలయాపన చేస్తే ఇరు ప్రాంతాలకు సమానంగా అన్యాయం చేసిన వారౌతారని ఆయన హెచ్చరిక చేశారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా పార్లమెంట్ లో తెలంగాణకు బీజేపీ మద్దతుగా ఓటు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.