స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో అగ్ని ప్రమాదం

State Bank of Hyderabad

వరంగల్ జిల్లా నర్సంపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బ్యాంకులో అగ్ని కీలలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కీలక రికార్డులన్నీ దగ్ధమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.