స్మశానాంధ్రప్రదేశ్ గా మార్చాడు: చంద్రబాబుపై విజయమ్మ ఫైర్

ysrcp-vijayamma

అనంతపురం జిల్లా కదిర నుండి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి 108, 104 పథకాలకు తూట్లు పొడిచారని ఆమె కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. 108 కి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండటం లేదని, కనీసం వాహనాలకు డీజిల్ కూడా కరువయ్యిందని అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను స్మశానాంధ్రప్రదేశ్ గా మార్చాడని బాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోలేదని విజయమ్మ వాపోయారు. జగన్ ను ఎలా గెలిపించారో అదేవిధంగా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.