`స్వచ్ఛభారత్` ఒక ఉద్యమం

న్యూఢిల్లీ : దేశాన్ని శుభ్రపరిచే `స్వచ్ఛభారత్` కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో యోగీ గురు రామ్దేవ్ తో పాటు మంత్రులు, పలువురు సినీ ప్రముఖులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు వ్యయంతో 2019 నాటికి భారతదేశం మొత్తం శుభ్రపడుతుందని భావిస్తున్నారు. మహాత్మాగాంధీ 145 పుట్టిన రోజున ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోదీ ఎర్రకొట నుండి ధారాళమైన ప్రసంగంలో ప్రకటించారు. విజయవంతంగా అమెరికా 5 రోజల పర్యటన ముగించుకొని భారత్ కు తిరిగివచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మోదీ చేత చీపురు పట్టుకొని ఢిల్లీ విధుల్ని శుభ్రం చేశారు. మోదీ వెంట పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ తారలు అమీర్ ఖాన్, ప్రియాంకా చొప్రా వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

pm-broom 2aగ్రామాలు,  పట్టణాలను పరి శుభ్రంగా ఉంచడానికి గత ప్రభుత్వం ఇంతకు ముందే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. కానీ ఆ పథకాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో అమలుకు నోచుకోలేదు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివశించే ప్రజల్లో నేటికీ మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో మలవిసర్జనకు సాయంత్రం వేళలో మహిళలు బయటలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో మహిళలు ఎంతో మంది లైంగిక వేధింపులకు గురికావల్సి వస్తోంది. మరుగుదొడ్డి లేని గ్రామీణ మహిళల వేతలను తీర్చాల్సి ఉందన్నారు.

శుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతదేశ పున: నిర్మాణాన్ని చేపడతాం అని మోదీ ఆగస్టు 15న తన ప్రసంగంతో భారతదేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పాఠశాలలో బాలికలు, బాలురకు విడివిడా మరుగుదొడ్డి ఉండాలన్నారు. పాఠశాలల్లో విడివిడా మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని సుప్రీం కొర్టుచేసిన ప్రయత్నం సఫలం కాలేదు. రాజకీయ నాయకుల అలసత్వంతో ప్రభుత్వ అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వడం సిగ్గుగా ఉందన్నారు.

babu 1కార్యక్రమాలను ప్రభుత్వమే అమలు చేస్తుందని, పరిష్కారం ప్రభుత్వమే చూపుతుంది అని ప్రజలు అనుకుంటే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేది కాదని చెప్పారు. పాత అలవాట్లను వదిలించుకోవడం, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి ప్రజల్లో ఒక స్వాతంత్ర్య ఉద్యమం లాంటిది రావాలన్నారు. మహాత్మా గాంధీకి పరిశుభ్రత అంటే దైవంతో సమానం చూసేవారు. గాంధీ శుభ్రంగా ఉండాలని కార్యక్రమాలు చేపట్టలేదు, కాని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనుకొన్నారు. వివిధ కులాలు, తరగతుల మధ్య అంతరాలు పోయి, పారిశుధ్య పనులు చేస్తున్నవారి పట్ల గౌరవం ఉండాలన్నారు. ఉద్యోగులు మాత్రమే శుభ్రం చేయాలని అనుకోకూడదు ప్రజలందరూ సమిష్టిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి పాఠశాలలో బాలికలకు, బాలురకు విడివిడిగా మరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

kcr-saddula batukamma 1ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పువ్వు పండుగ, బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిమగ్నమై ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.