స్వచ్ఛభారత్ లో పాల్గొన్న కమల్ హాసన్

హైదరాబాద్, నవంబర్ 7: ప్రముఖ చలనచిత్ర నిర్మాత, నటుడు కమల్ హాసన్ తన 60 వ పుట్టిన రోజునాడు మదంబాక్కంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం చెన్నై లోని మదంబాక్కం సరస్సును శుభ్రపరిచే ప్రచార కార్యక్రమాన్ని కమల్ ఆరంభించారు. ఆయనతో పాటు నర్ పాని ఇయక్కమ్ అనే స్వచ్చంధ సంస్థ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమల్ హాసన్ కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.