స్వచ్ఛ భారత్ పై మీడియా కృషి అభినందనీయం

ఢిల్లీ, అక్టోబర్ 25: ఢిల్లీలోని భారతీయ జనతా  పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన `దీపావళి మిలాప్` కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ సంపాదకులు, విలేకర్లతో సమావేశమయ్యారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మీడియా ప్రతినిధులతో మోదీకి ఇది తొలిసమావేశం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై మీడియా చేసిన కృషిని ముందుగా మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్న వ్యాసకర్తలు ఇప్పుడు స్వచ్ఛ భారత్ కథనాలపై దృష్టి పెట్టారు. వారు రాసిన కథనాలపై అంతర్జాతీయ స్థాయిలో అందరిని అవగాహన పరిచిందన్నారు. ఎలక్ట్రానిక్, సామాజిక మీడియా రంగాల్లో దీనిపైన చర్చలు కూడా నిర్వహించిందన్నారు.  స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మీడియా పాత్ర ముఖ్యంగా ప్రజల్లో మంచి అవగాహనతోపాటు సామాజిక చైతన్యం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించిందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని మోదీ అన్నారు. మీడియాతో తనకు చాలా సంవత్సరాల నుంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.