హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణస్వీకారం

khattar oath

హైదరాబాద్, అక్టోబర్ 26: మనోహర్ లాల్ ఖట్టర్, 60 ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో హర్యానా 10 వ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, బిజేపి అగ్ర నాయకులు ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు ఖట్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. హర్యానా పంచకుల నగరం మేలా గ్రౌండ్ లో గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ఖట్టర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.