హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖత్తార్

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖత్తార్ పేరును (60) భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఖత్తార్ ను కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారతీయ జనతా పార్టీ హర్యానా అధ్యక్షుడు రామ్ బిలాస్ శర్మ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ మనోహర్ లాల్ ఖత్తార్ పేరును ప్రతిపాదించడంతో శాసససభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.