హామీలను అమలుపర్చాలి : ప్రధానికి సోనియా లేఖ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఇచ్చిన హామీలను అమలుపర్చాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారని గుర్తుచేసారు. అలాగే రైల్వే బడ్జెట్ లో నిధులు కేటాయింపుతోపాటు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ను పూడ్చాలని సోనియాగాంధీ ప్రధానికి రాసిన లేఖలో కోరారు.

గత సంవత్సరం జూన్ 2వ తేదీన ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం అమలు గురించి ఒక లేఖ రాసాను దానికి సంబంధించి మీరు ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. ఇటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి వెంటనే వీటి అమలుకు తక్షం చర్యలు చేపట్టాలి, అంతేకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. 2014 ఫిబ్రవరి 20వ తేదీన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కూడా కల్పించాలని సోనియా గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు.

రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పిస్తామంటూ రాష్ట్రపతి ప్రసంగంలోకూడా చేర్చాలని సోనియాగాంధీ ఆ లేఖలో కోరారు.

రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా సహాయం చేయడానికి తగినటువంటి సహకారం అందించి, నిధులను కేటాయించాలి. అదే విధంగా రాజధాని నిర్మాణానికి తగిన నిధులను కేటాయించాలనే విషయాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు.

sonia gandhi letter

Have something to add? Share it in the comments

Your email address will not be published.