‘హార్ట్ ఎటాక్’ ను సొంతం చేసుకున్న జెమినీ

Heart-attack-Shat light

నితిన్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రానికి శాటిలైట్ రేటు భారీ మొత్తంలో వచ్చింది. దాదాపు నాలుగున్నర కోట్లకు జెమినీ టెలివిజన్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి వరుస విజయాలతో వున్న నితిన్ హీరో కావడం.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడంతో ఈ ప్రాజక్టుకి అంత క్రేజ్ వచ్చింది. ఈ నెల 31న ‘హార్ట్ ఎటాక్’ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ పై దీనిని నిర్మించాడు. నితిన్ సరసన బాలీవుడ్ భామ ఆదాశర్మ ఇందులో కథానాయికగా నటించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.