హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత ఫిలిప్ సీమౌర్ మృతి

Philip Seymour Hoffman death

ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత ఫిలిప్ సీమౌర్ హాఫ్మన్ కన్నుమూశాడు. న్యూయార్కు నగరంలోని తన సొంత అపార్టుమెంటులో ఆదివారం విగతజీవిగా పడిఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. అనుమానాస్పదంగా మారిన ఫిలిప్ మరణంపై న్యూయార్కు పోలీసు విభాగం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. అటు చీఫ్ మెడికల్ పరిశీలకుడు ఫిలిప్ చనిపోవడానికి కారణాన్ని నిర్ధారిస్తున్నారని చెప్పింది. 2005 లో కాపోట్ జివితచరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రంలో నటించిన ఫిలిప్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.