నటుడు అలీ తమ్ముడు ఖయ్యూం సురక్షితం

సినీ కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూంకు బుధవారం జరిగిన ప్రమాదంలో చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. తల, చేతికి, కాలుకు అయిన గాయాలకు చికిత్స చేసినట్లు తెలిపారు. కాగా, ఈ ఉదయం 9.30 నిమిషాలకు ఓ చిత్రం షూటింగు కోసం రామోజీ ఫిలింసిటీకి వెళుతుండగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ వద్ద ఖయ్యూం ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. దాంతో  వెంటనే అతన్ని దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. అటు లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.