హుదూద్ తుపాన్ తో పొంచి ఉన్న ముప్పు

హైదరాబాద్, అక్టోబర్ 9: హుధుద్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, ఒడిషాలోని గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇది విశాఖకు తూర్పు, ఆగ్నేయ దిశలో 720 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గోపాలపూర్ కి ఆగ్నేయ దిశగానూ అంతేదూరంలో ఉంది. ఈ పెనుతుపాను క్రమంగా పశ్చిమ, వాయువ్య దిశగా పయనించి మరో 24 గంటల్లో తీవ్ర పెనుతుపానుగా మారనుందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో అలలు రెండు మీటర్ల ఎత్తు ఎగసిపడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలోని తీరప్రాంతాల్లో 2 మీటర్ల ఎత్తువరకు అలలు ఎగసిపడతాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.